నమశ్శివాయ మంత్రం సదా రక్ష నీకు…
శివుని విభూది ధారణం…
సదా అండ నీకు…
సాగిపోవు నీపయనం శివుని తోడుగా….
హరుడు తోడుంటే నీకెవరు సాటి రారుగా…!! న!!
ఇష్టపడును ఈశుడు తనని నమ్మినంతనే…
నీకై కష్టపడును శంభుడు నువ్వు కొలిచినంతనే…
నిదురమరచి నిటాలక్షుడు నిన్ను కాయును…
తాను ఇల్లు మరచి నీకై నీ ఇంట చేరును…
లొంగి పోవు శంకరుడు అసమాన భక్తికి…
తాను పొంగి పోవు వరమివ్వ అభీష్ట సిద్ధికి…!! న!!
దీక్ష లాగ చేయి శివుని నిత్య ధ్యానము…
తపస్సు లాగ చేయి హరుని నామ స్మరణము…
బొందె తోనే చేరేదవు కైలాసపురమును…
ఏ సందేహము లేక శివుని సాన్నిధ్యమును…
స్వాగతించు శంకరుడు కైలాస నగరికి…
తాను ఇవ్వడింక మరుజన్మను ఏ యుగానికి…!! న!!
పాహిమాం… పాహిమాం పరమేశ్వర పాహిమాం.. రక్షమాం…రక్షమాం… సర్వేశ్వర రక్షమాం…