నీల కంఠాయనమః…

నీల కంఠాయనమః…
హే చంద్ర చూడాయనమః…
సర్వ సంప్రాప్తయే నమః…
కర్మ ఫల హరణయే నమః…
శరణాగతి ఇదే శరణాగతి…
సర్వ కాల సర్వ వ్యవస్థలయందు రక్ష నీవే గౌరీపతి…!!నీ!!

పాహిమాం అంటూ శరణు కోరితి శంకరా…
రక్ష మాం…అంటూ రక్ష కోరితి ఈశ్వరా…
ఫాలనేత్రా… అందుకొనరా మనసు చేసే పూజలు…
త్రిశూల హస్తా…స్వీకరించు చరణాల నుంచిన పువ్వులు…
సంతసించి పరవశిస్తే ప్రేమతో నా పూజకు..
శివా…నంది నవుతా కాపు కాయ చేరి నీ గుడి ముందుకు…!!నీ!!

స్వరము నిచ్చిన శంకరా…పలుకనీ నీ నామము…
నిర్మల హృదయమిచ్చిన ఈశ్వరా… నే చేయనీ నీ ధ్యానము…
పార్వతీశా…పరమ సుగుణా తీర్చనీ నీ ఋణమును…
శాంకరీశా… కరుణ హృదయా సేవించనీ ఈ జన్మను…
సత్యశీలీ…అడుగు తీస్తే తాకనా  పద ధూళిని…
హే చంద్ర మౌళి…శిరము కదిపితే దిద్దుకొనెదను రాలిన విభూదిని…!!నీ!!

పాహిమాం…శివ పాహిమాం…శివ పాహిమాం…రక్ష మాం..శివ రక్ష మాం..శివ రక్ష మాం…

Leave a Comment

Scroll to Top