శివుని పట్టమహిషీ నీకు నీరాజనం…
పరమేశ్వరుని హృదయ వాసిని నీకు అభివందనం…..
నిండు మనసు గల తల్లి దీవించవమ్మా….
ప్రేమ కన్నుల తల్లి కరుణించవమ్మా…
జయమమ్మ జయమమ్మ జై భవాని…
నీసాటి ఎవరమ్మ ఎవరమ్మ దుర్గాభవానీ…!!శివుని!!
సింహ వాహనమునెక్కి శాసించు జననీ…
హంస తూలికాతల్పము పై పవళించు పావనీ…
వంది మాగదులతో ఊరేగు శివుని రమణి…
వేనోళ్ళ పొగిడెదము నా తల్లి శివ మనస్విని…
జయమమ్మ జయమమ్మ శ్రీ శాంకరీ…
మా ఇంటి ఇలవేల్పు నీవమ్మ పరమేశ్వరీ…!!శివుని!!
లోకాలు మనగలుగు నీ కరుణ తోనే…
తల్లి…కష్టాలు కనుమరుగు నీ చూపుతోనే…
నీ అడుగు సవ్వడులు మా గుండె లయలు…
నీ దరహాస చంద్రికలు మాకు పంచ ప్రాణాలు…
జయమమ్మ..జయమమ్మ.. జగదీశ్వరీ….
జగములకు పెద్దమ్మ నీవమ్మ సర్వేశ్వరీ….!!శివుని!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వరీ రక్షమాం…