ఈశుని పుత్రుని కొలవండి…
ఆ ఈశ్వరి తనయుని తలవండి…
విఘ్నములన్ని దాటించి…
దీవెనలిచ్చును కరుణించి….
జయ జయ జయ జయ గణనాథా…
జయ శంభో శంకర గణనాథా…!!ఈ!!
వేస్తే చాలు పందిరిని…
దీవిస్తాడు మన అందరిని…
పెడితే చాలు కుడుములని…
తానిస్తాడు ఘన వరములని…
జయ జయ జయ జయ గణనాథా…
జయ శంకర శుభకర గణనాథా….!!ఈ!!
కల్మషమెరుగని గణనాథా…
మా కమ్మని గారెలు తినరాదా…
దోషములెంచక గణనాథ…
నీ దోస్తులుగా మము కనరాదా…
జయ జయ జయ జయ గణనాథా…
జయ మంగళమయ్యా గణనాథా…!!ఈ!!
పాహి పాహి గణనాథ… మామ్ పాహి పాహి గణనాథ…