నల్లా నల్లని గణపయ్య…
నీకు తెల్లా తెల్లని కుడుమయ్యా…
ఎల్లాగోలా గణపయ్య…
నువు చల్లగ చూడుము గణపయ్య…
గణ గణ గణ గణ గణపయ్య…
హే లంబోదర శివ గణపయ్య…!! న!!
పావన గణపతి కరుణించు…
ఓ షణ్ముఖ గణపతి రక్షించు…
లక్ష్మీ గణపతి దీవించు…
హే శంభో గణపతి మన్నించు…
గణ గణ గణ గణ గణపయ్య…
మా అండా దండా నీవయ్య…!!నల్లా!!
వరముల గణపతి వర్షించు…
హే సాక్షీ గణపతి స్పందించు…
నటనల గణపతి నర్తించు…
పద ఘటనల గణపతి నివసించు…
గణ గణ గణ గణ గణపయ్య…
మా హృదయము తెరిచే వుందయ్యా…!!నల్లా!!
పాహి పాహి గణనాథా… మాం పాహి పాహి గణ నాథా…