నమో నమో శివపుత్రా…
ఓం నమో నమో చిరునేత్రా…
ఓ వరాలిచ్చు గణనాథా…
మా పూజలందుకొన రారాదా…
వచ్చెయ్ వచ్చెయ్ గణనాథా….
వరములు తెచ్చేయ్ తెచ్చేయ్ గణనాథా..!!నమో!!
స్కందునితో నీ ఆటలు…
చూస్తుంటే రావిక మాటలు…
మురుగనితో ఆ ప్రేమలు…
చూసిన పార్వతీ కన్నుల చెమ్మలు…
సంతసమొంది శివపార్వతులు….
ఇచ్చును మీకు తీయని ముద్దులు…!!నమో!!
మూషికమే నీ నేస్తం…
తనకు నీవే సర్వం సమస్తం…
తన తోటి నీ గమనం…
చూసిన కన్నులకెంతో సంబరం…
జై జై అంటూ సురులు,నరులు…
స్వాగతమంటూ చల్లును పువ్వులు..!!నమో!!
గం గం గం గం గణపయ్య.. నువ్వంటే మాకు ఇష్టమయా…