మంచుకొండల నడుమ మల్లికార్జునుడా…

మంచుకొండల నడుమ మల్లికార్జునుడా…
చలికి ఎట్లున్నవో నీవు చంద్ర శేఖరుడా…
నిండు మనసు గల వాడ నిటాలక్షుడా…
నీ దయకు అంతెక్కడుందిరా ఆది శంకరుడా…
కనివినీ ఎరుగనిది నీ దివ్య రూపం..
కష్టాలు కనుమరుగులయ్యేంత కమనీయ రూపం…!!మంచు!!

పూజించవలలెనన్న చాలవే కరములు…
నిన్ను ప్రార్ధించవలెనన్న చాలవే అక్షరములు….
బ్రహ్మాండ మైనట్టి నీ రూపమును గాంచి….
బ్రహ్మ విష్ణువులొక్కరే స్తుతియించగలరు పరవశించి….
ఊహ కందనిది నీ సౌందర్య వైభవముల కవనము…
వ్రాయ ఎవరితరమయ్య శంకరా.. ఇలన నీ దివ్య గ్రంథము…!!మంచు!!

మహిమ గల రూపుడవు మాహేశ్వరా….
ఎంతో కరుణ గల హృదయుడవు శివశంకరా…
ప్రేమ గల రూపుడవు పార్వతీశా…
అత్యంత సౌకుమారుడవు నీవు శాంకరీశా….
భక్తితో మా కనులు నిను కొలిచితే…
మా జన్మ తరియించదా..శివా..నీవు దయతలచితే…!!మంచు!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం.. రక్షమామ్ రక్షమాం సర్వేశ్వర రక్షమాం ..

Leave a Comment

Scroll to Top