ఈశ్వరా..అర్పించనున్నాను నా మనసుని…
పరమేశ్వరా…సమర్పించ నున్నాను నా జన్మని…
భక్తి పూర్వకమైన వినతులివి మన్నించరా….
ప్రేమ పూర్వకముగ నను నీవు హత్తుకొనరా…
నమో …ధవళా చల శివా నమస్తే..నమస్తే…
ప్రభో…అరుణా చాలా శివా నమస్తే.. నమస్తే…!!ఈశ్వరా!!
కల్మషము తొలగించు మా హృదయమందు…
కలి మాయలను తొలగించు మా మనసులందు…
నీ గుడి కొలనులో వికసించు కలువలము మేమై..
నీ పూజకై వినియోగించు సుమములను మేమై..
కడతేరితే చాలు ఈ జన్మకు…
నీ మదిన నడయాడితే చాలు ఈ మనసుకు….!!ఈశ్వరా!!
సద్భక్తి పూర్వకముగా నినువేడుకొనులా….
నీపైన అనురక్తి ఇంకాస్త పెరిగిపోయేలా….
మళ్లించరా శివా నీ వైపు నా మనసుని….
మళ్లించితే మించేను భక్తిలో భక్త కన్నప్పని…
ఏ స్వార్థము లేని భక్తుడను నేనై…
వెలగనీ నీ మది గగనాన నక్షత్రమును నేనై…!! ఈశ్వర!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం…. రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్ష మాం…