నాగేశ్వరం…నమో నాగేశ్వరం..
నాగ పంచమీ వైభవం అజరామరం…
చంద్రేశ్వరం… నాగ చంద్రేశ్వరం…
ఉజ్జయిని కాళునికి నాగ నీరాజనం…!!నాగే!!
ఈశునికి లేవు జాతిమతాలు…
పరమేశునికి లేవు వర్గ వర్ణనలు…
పామైన పామరుడైన ఒక్కటే ఈశ్వరునికి…
భక్తికి పరవశించుటే తెలుసు శంకరునికి…!! నాగే!!
మూగ జీవాల భక్తి కి మురిసి పోయీ శివుడు ..
ముక్తి నొసగీ తన ఋణము తీర్చుకొనే హరుడు…
త్యాగమయమైన ఆరాధకులని…
భక్తి పూర్వకమైన మౌన హృదయాలని…
కరుణించు శివుడు కొనియాడుతూ…
దీవించు హరుడు జగమేలుతూ…!!నాగేశ్వర!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…