చూడరా కనులార సాంబశివుని…
ఉజ్జయిని లోనున్న కాళ లింగముని…
ఉత్తినే ఇచ్చు నట దీవెనలను..
నిన్ను బొత్తిగా అడగట ఏ సిరులను…
కొలిచితే నీ జన్మ ధన్యమోయి…
తన మనసులో నిలిచితే మరుజన్మ ఉండదోయి…!!చూడరా!!
చేసినా నువ్వెన్ని పాపాలను…
తాను మన్నించి తొలగించు దోషాలను…
వేసినా ఒక తప్పటడుగైననూ…
నిన్ను సరిదిద్ది చూపించు తన బాటను….
నమ్మరా శివుని…కాపు కాచేను…
శరణనుమురా హరుని…ప్రేమ చూపేను…!!చూడ!!
వుంచరా పాదాల ఓ పువ్వుని…
నువ్వొంచరా ఓసారి నీ శిరముని ..
కానరా ఆపైన తన రూపుని…
నీవు చూసేవు కరుణించు తన చూపుని…
ఆగలేక పడిపోతువు చరణాలపై…
గీత మల్లి పాడుకుంటావు శంకరుని పై…!!చూడరా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వర పాహిమాం…రక్ష మాం.. రక్షమాం..సర్వేశ్వర రక్షమాం…