పెట్టరే కన్నయ్యకు వెన్న ముద్దలు…
తినిపించరే ప్రేమతో గోరుముద్దలు…
వెన్నంటే మిన్నంటిన ఇష్టమతనికి…
అది వుందంటే దొంగాటే ఆడు చివరికి…!! పెట్టరే!!
రేపల్లె వాసుడమ్మ చిన్ని కృష్ణుడు…
తాను గోపికాలోలుడమ్మ కొంటె కృష్ణుడు…
మాయలెన్ని చేసినా తను మంచి చేయు తుదకు….
అతని మర్మ మెరుగ తరమా అది అర్థమవదు మనకు….
మాధవా…చాలునయ్య చాలును నీ మాయలు…
తిరిగి ఇవ్వరా అనెనే తమ చీరలని ఆ గోపికలు…!!పెట్టరే!!
కాచినాడు గోకులాన్ని చిటికెన వేలితో…
పొగరణచినాడు కాళమునకు పద నర్తనతో…
అల్లరోడు కాదే ఆ చిలిపి కృష్ణుడు…
మనని ఆదరించు వాడే ఆ దేవకి సుతుడు….
కేశవా… గైకొనిపో పాలు,తేనె ఫలములు….
తిని వుంచిపో ఇంట నీదు బుల్లి పాద ముద్రలు…!!పెట్టరే!!
పాహిమాం…పాహిమాం…మురళీ ధర పాహిమాం…రక్ష మాం..రక్ష మాం…హే నారాయణ రక్ష మాం…