గణనాయకా తొలగించు విఘ్నాలను…

గణనాయకా తొలగించు విఘ్నాలను…
శుభదాయకా జరిపించు కార్యాలను…
వరదాయకా వారించు కష్టాలను…
జన్మ చరితార్థికా దీవించు నీ జనులను….
వున్నావు మదిలోన చూడు గణేశా…
నిత్యమూ నిను తలచు ఈ మనసు నీది గణేశా…!!గణ!!

విఘ్న రాజా…విజయాలనందించవయ్యా..
ప్రేమ పూజ్యా…నీ ప్రేమ చూపించవయ్యా…
గణపతీ…మా పూజ తొలి స్మరణయే నీవు…
సిద్ధి గణపతీ…మా ఇంటి రక్షయే నీవు….
శరణంటి..శరణంటి…వినుము గణేశా…
నీ నామ స్మరణయే రక్షంటి నిజము గణేశా.. !!గణ!!

జై గణేశ అనిన జయములిచ్చేవు…
శరణు గణేశా అనిన అభయమిచ్చేవు…
అంబాసుతా… ఆదుకో దీనులందరినీ…
గౌరీ సుతా…జరిపెదము చవితి పండగని…
అందుకొన పూజలను రార గణేశా..
చేసుకొన సంబరములు ముద్దు గణేశా..!!గణ!!

పాహిమాం…పాహిమాం…గణానాయకా..రక్షమాం… రక్షమాం… శుభదాయక…

Leave a Comment

Scroll to Top