అలమేలు పతి అందమును చూడరే…
పద్మావతి విభుని ప్రాభవమును కానరే…
దివ్య మంగళ రూపాన దేదీప్యమానమై….
విశ్వమోహన రూపాన విలక్షణ దైవమై….
వెలుగొందుచున్నాడు వేంకటేశ్వరుడు…
నీలాల కనులతో వీక్షించుచూ వకుళమ్మ సుతుడు..!!అల!!
శ్రీనివాసా..కటి హస్తముతో మమ్ము కరుణించవయ్యా…
వేంకటేశా…చిరు మంద హాసముతో మమ్ము దీవించవయ్యా….
ఎక్కుతున్నాము మేము నీ సప్త గిరులు….
చెల్లించు చున్నాము భక్తితో నీ ముడుపులు…
గుర్తుంచుకోవయ్య నామాల వాడా…
గుండెలో దాచుంచుకుంటాము నిను మేము ఏడు కొండాలవాడా….!!అల!!
కట్టి.. కట్టీ.. వడ్డీలు…వడ్డికాసుల వాడైతివి..
లక్ష్మిని చేత బట్టీ కూడా ఋణ గ్రస్తుడవైతివి…
చింతాయరా మాకు తిరుమలేశా…
మనసు బరువాయరా మాకు చిద్విలాసా….
వేస్తూనే వుంటాము కానుకలను…
తీర్చేయరా కుబేరుని బాకీలను…!!అల!!
మంగళం…మంగళం..వేంకటేశాయ మంగళమ్…మంగళమ్ శుభ మంగళం… శ్రీనివాసయా మంగళమ్…