శ్రావణ మాసపు ఘడియలలో….

శ్రావణ మాసపు ఘడియలలో….
నిను కొలిచెను భక్తులు లక్షలలో…
నేనొకడిని అందున పరమేశా…
నా పిలుపులు అందేనా జగదీశా…!!శ్రావణ!!

ఏ పిలుపైనా చెవినేసుకుందువు…
ఏ పలుకైనా వినిపించుకొందువు..
తరతమ బేధాలెరుగవు నీవు…
అతి త్వరితముగా స్పందింతువు నీవు…
ఇది కలయా నిజమా అని తెలిసే లోగా….
నువు మాయలు చేస్తువు అవి మరి చే లాగా…!!శ్రా!!

వేడుకొనిన ఈ మాసాన…
వరమిస్తువంటగా వలదనినా…
కోరుకొనిన  ఈ తరుణాన….
కాదనక ఇస్తువటగా ఏదైనా…
ఎన్నో ఘనతలు కల్గిన దేవా…
మా కథలని విని కడతేర్చగ రావా…!!శ్రా!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top