అపరంజి బొమ్మవే పరమేశ్వరీ…

అపరంజి బొమ్మవే పరమేశ్వరీ…
ఆదిపరాశక్తివే జగదీశ్వరీ….
మందార పువ్వువే మాహేశ్వరీ…
శివుని మది వనాన పూసేవు సర్వేశ్వరీ….
అమ్మ…నీ పాదాలు అంటనీయమ్మ…
తల్లి..మా కంట తడిని తుడవరావమ్మ..!!అప!!

ఏడేడు లోకాలు ఎలుగెత్తి చాటునే…
పద్నాల్గు భువనాలు పాదాలు కడుగునే…
కనక సింహాసనముపై కూర్చున్న మా తల్లి పావని…
కనకపుష్యరాగాలతో నిన్ను పూజించని….
రేయనక  పగలనక పాలించు జననీ..
మా మది మందిరమున శివునితో సేదతీరమ్మ శాలిని…!!అప!!

వేల సంకీర్తనలు పలుమార్లు పాడినా…
కోట్లాది పండితులు కావ్యాలు వ్రాసినా…
చాలవే నా తల్లి నీ వైభవమునకు….
అవి తక్కువే నా తల్లి…నీ ప్రాభవమునకు…
కాము తల్లీ…మేము కాళిదాసులం…
నిను పొగడ తరమా తల్లి..మేము భక్తి నిరక్షరాస్యులం….!!అప!!

పాహిమాం పాహిమాం పరమేశ్వరీ. రక్షమాం రక్షమాం జగదీశ్వరీ…..

Leave a Comment

Scroll to Top