కైలాస గిరి సుందరా…

కైలాస గిరి సుందరా…
నా స్వామి…ఉజ్జయిని కాళేశ్వరా..
పుష్పార్చనలకే నీవు పరవశించేవు…
బిల్వ పత్రార్చనలకే నీవు సంతసించేవు…
ఈ పాటి దానికే మాఫైన కరుణ చూపేవు…
ఇంతోటి దానికే ఎంతోటి వరములిచ్చేవు…
శివాయ…శివాయ..నమఃశివాయ…
హరాయ..హరాయా.గంగాధరాయ.!!కైలాస!!

ఎంత విశాలమయ్యా శివా… నీ హృదయము…
అందుకే నీ గుడి మాకయ్యె ప్రేమాలయం…
ఎంత ప్రేమ శోభితమో శివా…నీ ముఖ బింబము…
అందుకే కలుగు నీతోటి అనుబంధము…
ఏమరు పాటున కూడ నిను మరువలేనట్లు…
మాయ చేశావు తండ్రీ..నిను మరచుటెట్లు…!!కై!!

శివా…ఏమనుచు పొగిడేది నీ కరుణని…
హరా…నేనేమనుచు కీర్తించు నీ ఘనతని…
గోరంత భక్తికే కొండంత ఫలములిచ్చేవు…
దోసిళ్ళ పూలకే రేపవలు  రక్షవవుతావు….
శిరము పై నున్న గంగనైనా నీవు మరతువేమో…
నీకై తపించు భక్తులను కలన కూడా నీవు మరువవేమో…!!కై!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...రక్ష మాం..రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top