కనిపించుచున్నాడు కారుణ్యమూర్తి కోపోద్ర్రేకమున నేడు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

కనిపించుచున్నాడు కారుణ్యమూర్తి కోపోద్ర్రేకమున నేడు…
భక్తి భావోద్రేకముతో కొలిచితే తొలగు కోపాలు తనలోన కనుడు…
కనిపెంచిన కైవల్యమూర్తికి కలదు కొండంత మనసు…
కనిపెట్టుకొని కాపాడు హరుని కరుణ ప్రేమ తామరల సరసు..
శివాయ..హరాయ…శివశంకరాయ..
శివహరాయ..శివాయ… హరిపూజితాయ..!!కని!!

వల్లమాలిన భక్తి వలదనును విశ్వేశ్వరుడు….
వాక్సుద్ధితో చేయు పంచాక్షరీ పఠనమే చాలునను పరమేశ్వరుడు…
ఇబ్బడి ముబ్బడిగా ఇక్కట్లు చుట్టుముట్టాడినా…
కుప్పలు తెప్పలుగా కడగళ్ల వడగళ్ళు మన పైన కురిసినా…
నిర్భయముగ కొలిచెదము నిటలాక్షుని భక్తిగా…
అభయమిచ్చు ఆదిశంకరుడు తరలి రాడా మనకు రక్షగా…

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top