ఒదిగేవు ఎటులైన లింగము పై శివశంకరా….

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఒదిగేవు ఎటులైన లింగము పై శివశంకరా….
కనుల మెదిలేవు కాత్యాయినీ పతివై  అభయంకరా….
గత రాత్రి కలలోన గురుతు చేస్తువో….
శుభ సుప్రభాతాన తీరు సూచిస్తువో…
దిద్దేరు ఆర్యులు నీ రూపుని
 ఎంచక్కగా…
వరుస కట్టేరు భక్తులు నిను మొక్కగా…
మాం..పాహి…మాం..పాహి పరమేశ్వరా…
మారేడు దళ ప్రీతి మాహేశ్వరా…!!ఒదిగేవు!!

నీ క్షేత్ర సందర్శన భాగ్యమెప్పుడిస్తువో నువ్వనీ…
నేత్ర పర్వముగ నున్న నిను దర్శించు క్షణము ఎపుడొస్తుందోననీ..
వేచి వున్నారు వేవేల జనులు నీ అనుమతికై ఆశగా….
తపము చేయు చున్నారు మది లోన తమ కోర్కె తీరు దశగా…
జాగేల శంకరా…చేయరా రమ్మని జారీ….
పరుగులెట్టేము పట్టుకొని ఉజ్జయినీ పురి దారి….

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా...
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా...

Leave a Comment

Scroll to Top