అడ్డనామాలోడ..ఆదిశంకరుడా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

అడ్డనామాలోడ..ఆదిశంకరుడా…
విభూథి   ప్రియుడా…కాళలింగేశ్వరుడ…
అవతరించావుగా నువ్వు మాకోసము…
విని తరించమని నిత్యమూ నీ నామ  గానము…
జయము…జయమయా..నీకు శంకరా…
జగతి దాసోహమయా నీకు  అభయంకరా…!!అడ్డ!!

నడుమ సరిఅయిన  బట్టా లేదు…
మెడన వెసుకొన ఉత్తరీయమూ లేదు….
గజచర్మమే నీకు పట్టు వస్త్రమాయే..
నాగుపామే నీకు ఉత్తరీయమాయె..
ఏ సొబగులు లేని సాంబడివి నువ్వు..
దిక్కులే వలువలయినట్టి  దిగంబరుడివి నువ్వు..
జయము..జయమయా నీకు శంకరా…
జగతి దాసోహమయా  నీకు అభయంకరా…!!అడ్డ!!

సహజ సౌందర్యమే నీ అందమై…
దైవత్వమే నీ ప్రేమ బంధమై…
అల్లుకొని పోతావు మా అంతరాత్మతో…
చేయమని స్నేహమును పరమాత్మతో…
కష్టమొస్తే రెప్పదాటివ్వను కన్నీటినని…
బాధలొస్తే భయపడకు తోడు నేనున్నాని…
చెప్పరా శంకరా… చెలికాడిలా…
మనసిప్పరా హర హరా..మా వాడిలా…
జయము..జయము..నీకు శంకరా…
జగతి దాసోహమయా నీకు అభయంకరా…

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా…
రక్షమాం..రక్షమాం…సర్వేశ్వరా...

Leave a Comment

Scroll to Top