ఎందుకో ఏమో తెలియదయ్యా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఎందుకో ఏమో తెలియదయ్యా…
నీవే నాకు లోకమైనావు శివయ్య..
ఎప్పుడో ఏమో తెలియదయ్యా..
నీ మాయలో పడి నా మది నను మరిచెనయ్యా…
ఉదయాస్తమానాలూ నీ ధ్యాసలే…
పట్టించుకొనదాయె నన్నస్సలే..!!ఎందుకో!!

విడవనంటుంది శంకరా..నీ నామ ధ్యానమే…
పొద్దుతెలవదంటుంది చూస్తుంటే నీ రూపమే…
మాటలు రాని మదికి మంత్రాలు తెలియవయ్య…
ఏ బీటలూ లేని తన గుండె గర్భగుడికి చేర జాగేల శివయ్య…
స్థిరముగా నువ్వుంటే చాలునంట…
అస్థిరములైన వాటికి ఆశ పడదంట..!!ఎందుకో!!

ఏ నోము నోచెనో నా మూగ మనసు..
తెలియకనే చేస్తోంది..లోలోన నీ తపసు…
ఎన్నాళ్ళనాటిదో తన జన్మ ఋణశేషమూ..
తన కంటిచెమ్మను గంగలా మార్చి కడగాలనుకుంటోంది నీ పాదము..
ఆనతియ్యరా శంకరా..నీ పాదాలు తాకగా…
కడిగి తరియించదా స్వర్గధామాలు కనిపించగా..!!ఎందుకో!!

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా..పాహిమాం..
రక్షమాం..రక్షమాం..అభయంకరా.. రక్షమాం..

Leave a Comment

Scroll to Top