ఓమ్ నమ:శ్శివాయ నమ:


వక్రతుండ మహాకాయా..
కదలి రావయ్య వరములియ్య…
ఏకదంతా బొజ్జగణపయ్యా…
పూజలెన్నైన నీకు చేయుమయ్య..
గం.గం..గణేశాయా గౌరీ సుతాయా..
డం..డం..డమరుక నాద బృందాల ప్రమదగణనాధాయా…!!వక్ర!!
నలుగు పిండితో మీ అమ్మ బొమ్మనే చేసింది…
ఆ బొమ్మకే ప్రాణాలు పోసి నిన్ను దైవమై మాకు ఇచ్చింది…
గజముఖము నొసగి గంగాధరుడు నిన్ను గజాననుడిగా చేయగా…
శూర్పకర్ణ రూపమై వెలిశావు నిశితముగ మా బాధలు విని తీర్చగా..!!వక్ర!!
పచ్చనీ తోరణాల వెలగపళ్ళ పాలవెల్లీ కట్టి…
మొక్కజొన్న పొత్తులను నలువైపులా కట్టీ..
చెరువు మట్టితో నీ దివ్యప్రతిమను చేసి కూర్చుండ బెట్టి…
పసుపు కాసింత రాసి కుంకుమ బొట్టూ పెట్టీ…
చేసేమయా నీకు ఎన్నైన చవితి పూజలు…
వండి పెట్టేమయా ఎన్నైన కుడుములు,ఉండ్రాళ్ళు,గారెలు..!!
పాహిమామ్..పాహిమాం..గణాధ్యక్షా
రక్షమాం..రక్షమాం..సిద్ధి విఘ్నేశ్వరాయా రక్షమాం…