సాక్షత్కరించినావా సాంబశివా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

సాక్షత్కరించినావా సాంబశివా…
కాళలింగముపై ఆవహించి పరమ శివా…
రాలేము కైలాసమునకు మేమని…
వేంచేసినావా…మా కోసమై ఉజ్జయినికి కని తరించమని…
ఎంత దయరా నీకు పరమేశ్వరా…
చెప్పతరమా మాకు జగదీశ్వరా..!!సాక్షత్క!!

ఎక్కడున్నారయా ఆశుకవితా పితామహులారా…
వేగముగ వచ్చి వర్ణించండి అనర్గళముగ కాళేశ్వరుని గాంచి కన్నులారా…
వినాలనిఉంది ప్రస్తుతిస్తుంటే హరుని ఆర్తి మీర…
తరించాలని వుంది ఆ తండ్రి దివ్యసౌందర్యమును జూచి భక్తి మీర…
ఊరికే పోదయా మీరు చేసిన వచన యాగము…
శివుడు ఊరుకోడయా మీకు ఇవ్వక ముక్తి యోగము…!!సాక్షత్క!!

ఎక్కడున్నావమ్మా తల్లి పార్వతీ…
చూడ బహు చక్కగనున్నాడు నేడు మా గిరిజాపతీ…
నవవరుడు మల్లె నిటలాక్షుడు…
వేచి ఉన్నాడు నీ కొరకు నీ ప్రాణ విభుడు…
పంచుకోవాలని నీతోటి ప్రేమానురాగాలని…
తెలుసుకోవాలని మా తరము మీ ఆదిదంపతుల అనురాగ బంధాలనీ..!!సాక్షాత్క!!

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా…
రక్షమామ్..రక్షమాం..సర్వేశ్వరా..

Leave a Comment

Scroll to Top