


లలాటమున త్రినేత్ర సహిత త్రిశూలము…
పాప భీతి రహిత అవని దున్ను హలము…
సాగు చేయరా శంకరా..మా బ్రతుకు బీడు భూములను…
విరబూయించరా హర హరా…ప్రతి ఇంట వరముల విరి కొమ్మలను…!!లలాటమున!!
మట్టి మనుషులము మేము..
మందబుద్ది కలవారము…
దుక్కిదున్నితేగాని సారమవని
నేలలం..
నీ పదము మోపితే చాలు..నీ పదపూజకు పూల నిచ్చు తోటలం..!!లలాటము!!
సస్యశ్యామలమైన మాగాణినేల లాంటి మనసులై ..
భక్తి సుధామయములైన పారిజాత వనములై…
ఎదగనీ శంకరా…నింగి వైపు ఏపుగా..
మము పెరగనీ భవహరా…కైలాస గిరులనందుకొనగ…!!లలాటమున!!
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా