ఓమ్ నమ:శ్శివాయ నమ:


రజతమకుటధరా…గంగాధరా
రత్న,మణిమయ ఫణి భూషణా పరమేశ్వరా…
కరిగెరా నిను కనగనే నా మది కర్పూరములా…
అది వెలిగెరా నా హృదిన దివ్యజ్యోతి లా…
శంకరా…వేయనా అడుగు ముందుకు….
నీ చరణాల మ్రోల సుమములుంచి మొక్కు కొందుకు…!!రజత!!
చూడగనే ముక్తి కలుగు నీ ముఖ వర్చస్సు…
భక్త జనకోటి హృదయాలలో వెలుగు నింపు నీ ఉషస్సు…
చేయకనే ఎవ్వరమూ ధ్యానముతో నీ తపస్సు…
వరదాయకుడవై చిందించు నీ చిరునవ్వు శివా ఇంద్రధనస్సు..!!రజత!!
మోక్షమిచ్చు మూర్తివి..నీ మౌన భాష ఎట్లు మాకు తెలుసునయా..
కరుణ చూపు తండ్రివి కదా…నీ కంటి పాపలే చెప్పెనయా…
భక్తి మీర నీదు పూజ చేసుకొమ్మని..
శక్తికొలది నీదు సేవలో మునిగి పొమ్మని…!!రజత!!
పాహిమామ్…పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..