ఓమ్ నమ:శ్శివాయ నమ:

29.11.2021
వచ్చామయా శంకరా..వచ్చామయా
నీ గుడికి మేమంతా వచ్చామయా..
తీర్చామయా మొక్కు తీర్చామయా..
దర్శించికొను వత్తుమను మొక్కు తీర్చామయా…!!వచ్చామయా!!
తెచ్చామయా శంకరా..తెచ్చామయా
పాలు,తేనెలు,పళ్ళు మోసుకొచ్చామయా..
చేసేమయా హరహరా చేసేమయా..
పంచామృతాభిషేకములు చేసేమయా…
వేశామయా పరమేశ్వరా వేశామయా…
బంతి,విరిజాజుల దండలను వేశామయా…
ఉంచామయా ఈశ్వరా ఉంచామయా..
ఎండు ఫలద్రాక్షాఖర్జూరములను నైవేద్యముగ ఉంచామయా..
చదివామయా పశుపతీ చదివామయా..
పంచాక్షరీ మంత్రాలు పలుమార్లు చదివామయా…!!వచ్చామయా!!
కొలిచామయా కైలాసవాసా కొలిచామయా…
చల్లంగ చూడమని నిను మేము కొలిచామయా…
నిలిచామయా..నిటలాక్ష నీ ముందు నిలిచామయా..
దీవించమని శిరమొంచి నిలిచామయా..
నీవేనయా శివ శివా నీవేనయా..
మా తల్లైన తండ్రైన నీవేనయా..
నిజమేనయా..హర హరా నిజమేనయా..
మా సకలమూ, సర్వమ్ము నీవేనయా…
నీనయనాల నీడల్లో బ్రతికేమయా..
నీ చరణాలు తాకి మోక్షమొందేమయా..!!వచ్చామయా!!
పాహిమామ్..పాహిమామ్.. శివశంకరా…
రక్షమాం.. రక్షమాం.. అభయంకరా..