ఓమ్ నమ:శ్శివాయ నమ:


విన్నావటయ్యా…శివయ్యా..
భక్త జన కోటి నోట మాట….
హర హర మహాదేవుడే మా దేవుడనీ…
నీ నామ స్మరణమే తమకు రక్షయనీ…
కన్నావటయ్యా…శివయ్య..
చేధించనలవి కాని భక్త జన సమూహాల కోట…
యుద్ధాన్ని గెలిచిన సైన్యంబు వోలె..
విజయడంఖాను మోగించు రణ వీరులోలె…
కదలి వస్తున్నారు కడలి తరంగాల లాగా….
కనగ వస్తున్నారు కరుణార్థులై మనసారా నిను కొలవగా…!!విన్నా!!
నీవే తమ సర్వస్వమనీ…
నీ సేవే పరమార్ధమనీ….
జ్ఞాన జ్యోతి వెలుగునటుల…
సేవా నిరతి కలుగు నటుల…
జనజాగృతము చేయరా జంగమా…
మది ద్విగుణీకృతము చేయరా లింగమా…మహాకాళలింగమా…!!విన్
ఉజ్జయినీ పురాధీశ మహేశా…
నీ కాలి గజ్జెనై చేరనా గిరీశా…
నృత్యశాస్త్ర ఆదిదేవ నట్వంగమా…
నేర్పవయ్య నిను కొలుచు నృత్య రీతి భంగిమ…
నిన్నారాధించే క్రమములో నేను కూడ కళాకారుడినవనీ..
నీ ప్రమదగణ సమూహములో నన్ను కూడా సభ్యుడనవనీ…
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం..