ఓమ్ నమ:శ్శివాయ నమ:


చెప్పుకొనరా శంకరా… భక్తులు నిను దర్శించుకొని…
నీ దివ్య తేజస్సును గాంచి ధన్యతను పొందామనీ..
వర్ణించరా భక్తితో నీ సౌందర్యమును తమ భాషలో పద పదములను ఏరుకొని….
స్మరియించరా నీ లీలలను తమ మనసులో పద కవితలు రాసేసుకొని…!!చెప్పు!!
అమ్మా..భారతీ…వరమియ్యవమ్మా మాకు ఆది శంకరుని
శ్లాఘించుటకు శ్రావ్యముగ సుస్వరములను…
తల్లీ శారదా…వ్రాసేయవమ్మా..
నా నాల్కపై నాగేశ్వరుని కొలవంగ నభూతో నభవిష్యత్ అన్నట్లు నాల్గు రతనాల మాటలను…
తెలుసుకొనవమ్మ…మా ఆరాధనల పటిమనీ…
ఎటులైన పొందాలన్న పరమేశ్వరుని మనసులో చోటునను కోర్కెనీ…!!చెప్పు!!
విశ్వసౌందర్యమే స్వంతమైన కాళేశ్వరుని ఎదుట నిలిచి వినమ్రత తో ఆర్థిగా ప్రార్ధించలేకున్నా…
సర్వలోకములనేలు మంగళాకారుని చెంత నిర్లిప్త మోముతో నిశ్శబ్దముగ నిలిచి వున్నా…
వృధాయేకదా విధ్యాధరీ…మాకు తానిచ్చిన ఈ జన్మ…
అందుకే వినయముతో కోరేము నిన్ను మాకు అందించవమ్మా…
వల్లించగా ఆ తండ్రికి భక్తితో ఆసుకవితల ముత్యాల కొమ్మ…
విని పరవశించి ప్రసన్నుడై పరమేశ్వరుడు తుడవాలి మా కంట ఆనందాల చెమ్మ…
పాహిమామ్..పాహిమామ్..పార్వతీశా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..శివశంకరా రక్షమామ్..