ఓమ్ నమ:శ్శివాయ నమ:


ముక్కన్ను ముదమాయానా శంకరా..
ముప్పూట పూజించమా హర హరా..
తెరిచావుగా నింపాదిగా ఆ కన్నునీ..
తెరిచి చూడరా ఇకనైన మా గుండె తలుపులని..!!ముక్కన్ను!!
చూడరా శంకరా…హృదిలోన కనిపించు ఒక చిన్ని కైలాసము…
తిలకించరా హర హరా..
పానవట్టముపై కూర్చుండి నీ ప్రతిరూపము చేస్తున్న చిద్విలాసము…
నిను తలవనీ, కొలవనీ క్షణము లేదు శంకరా…
నిను మరువనే మరువనన్న మది గొడవ వినుము హర హరా…!!ముక్కన్ను!!
ముల్లోకములు లేలు ముక్కంటివయ్యా…
కరుణింతువని మేము కలగంటిమయ్యా….
నిజము చేయగలడు మా కలలు శివుడనీ…
నేత్రపర్వముగ దర్శనంబిచ్చేటి మారేడు మా దేవుడనీ…
ఆగిపోనివ్వని ఆరాధనలతో..
నిలిచిపోనివ్వని నివేదనలతో..
సాగిస్తూనే ఉంటాము నీ తోటి ప్రయాణము..
కొనసాగిస్తూనే ఉంటాము పఠించుతూ నీ దివ్య పురాణము..
పాహిమామ్..పాహిమామ్… పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్…