ఓం నమో పార్వతీ రూపం  శివం సుందరం…

ఓం నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఓం నమో పార్వతీ రూపం  శివం సుందరం…
ఓం నమో గిరిజా మహేశం ప్రభుం దివ్య తేజం..
గౌరీ ప్రియ వదన గంగాధరం..
ఉమా కోమల నయన కాళేశ్వరం..
అద్భుతం..అనంతం..జననీ నీ దివ్య దర్శనం…
అఖండం..అనంతం..నిను కనిన మా జన్మ పావనం…
జయమమ్మ…జయమమ్మ…జగదీశ్వరీ…
జగదీశ్వరుని హృదయాన కొలువైన పరమేశ్వరీ…!!ఓం!!

అమ్మా..భవానీ..కానా నీ పాదాలకు నేను పారాణీ…
తల్లీ శివానీ.. అవ్వనా నేను నీ కాలి మువ్వనీ..
పారాణిలా పాదాలనంటిపెట్టుకొని వుండు వరమియ్యవమ్మా…
మువ్వలా నీ ప్రతి అడుగులో నను సవ్వడే కానియ్యవమ్మా…!!ఓం!!

సకల సౌభాగ్యములనిచ్చు శివశంకరీ…
సర్వ శుభముల నిచ్చు అభయంకరీ..
కాపాడవమ్మ  కాత్యాయినీ….
మా ఆడపడుచుల అయిదవతనముని…
సిరి సంపదలు కోరని సౌదామినిలు వారు…
చిటికెడు పసుపు కుంకుమలకే ఆశపడు చిరు సుహాసినిలు వారు…
అమ్మవని నిను నమ్మి పూజించి ప్రేమించు అందాల భరిణులు వారు..
సాక్షత్కరిస్తే మొదటగా నీ కుంకుమ నే కోరి భక్తితో దాచుకొను కుంకుమ భరిణులు వారు…

పాహిమామ్..పాహిమామ్..పార్వతీ రూప శివ దర్శనం…పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరాయ   శివా రక్షమామ్…

Leave a Comment

Scroll to Top