మంచు లింగమున జంగమా…

ఓంనమఃశ్శివాయనమః🙏🙏🙏

మంచు లింగమున జంగమా…
దర్శించి మేము తరించమా…
నీలి కన్నుల నీలకంఠా…కన రావ శివా మము ఓరకంట…
ఆది దేవుడవు నువ్వురా…
మమ్మాదుకొన రావేమిరా….
శంకరా…వినిపించమా..శంఖ నాదపు ప్రార్ధనలను…
హార హారా…మ్రోగించమా  ఢమరుకమున నీ నాద శబ్దములను…
పాహిమాం..శివ పాహిమాం…
రక్షమాం.. శివ…రక్షమాం….

ఎన్ని రూపాలుగా సాక్షాత్కరించావురా శివా…శ్రీ కాళ లింగము పై…
అన్ని రూపాలనూ ప్రతిమలుగ చేసి ఉంచామురా శివా
మా హృదయపీఠముపై…
కొలుచుకొను యోగమును ఇవ్వరా శివా…
నిత్యమూ నిను తలచుకొను భాగ్యమును ఇవ్వరా శివా…
కరిగి పోనివ్వరా శివా…నీ మనసు మంచు కొండలా….
కడదాక ఉండగా మాకు అండ దండలా…
రాలిపడనీ శివా నేలపై…నీ ఒంటి పైనున్న చిటికెడంత విభూధిని…
కళ్ళద్దుకొని దిద్దుకొనమా మా నుదిటిపై నీదు నామాలని…
ఏ దుష్టగ్రహ దోషములు అంటుకొనక
సాగనివ్వరా శివా.. సాఫీగా మా బ్రతుకు నడక….
ఏ అదృశ్య శక్తులు మా పైన పనిచేయ కుండునట్లు రక్షించరా శివా… కొలిచేము నిను మేము మా జన్మ చివరి దాక….
 
పాహిమాం…పాహిమాం..శివశంకరా…
మొరలాలకించి రక్షించరా మాహేశ్వరా..

Leave a Comment

Scroll to Top