ఓం నమశ్శివాయ నమః 

విప్పారిన నీ కన్నులు మము పిలుచునని….
తానంతట మా మది నిను తెలియకనే కొలుచునని…
నీ తోటి మాకున్న ఈ అనుబంధము చెప్పేనురా శివా…
ఆధ్యాత్మిక అనుబంధపు విలువలు మాకు తెలిసెనురా శివా…
చింతలు మరచి చేతులు ముడిచి నిను ప్రార్ధిస్తుంటే శంభోహరా…
అరె..వింతగ మారే ఈ బ్రతుకుల తీరే నిను ధ్యానిస్తుంటే గంగాధరా…
కనిపించని మాయ..ఏదో ఒకటి మాలోన ప్రవేశించెరా…
ఊహించని మలుపుల మజిలీని మాకు చూపించెరా….
సాగిపోనీ నీకంకితమైన ఈ జీవితం ఆగి పోని నావలా…
కొనసాగిపోనీ మా పయనం నీ సేవలో.. మా ఆశయాలు నెరవేరులా…
పాహిమాం..పాహిమాం..శివశంకరా…
రక్షమాం..రక్షమాం..అభయంకరా…