నిలిచామయా శివా…నీ కళ్ల వాకిళ్ల ముందరా…

ఓంనమఃశ్శివాయనమః🙏🙏🙏

నిలిచామయా శివా…నీ కళ్ల వాకిళ్ల ముందరా…
కోరి కొలిచామయా శివా…కళ్లారా నిను గాంచి గంగాధరా….
పరికించరా శివా…ఓ సారి కరుణతో మా మనసుని…
నీ సేవకై నిలువెల్ల తపియించు ఈ తనువుని…!!నిలి!!

నిత్యనీరాజనములు మేము ఏమారకుండా….
నీ సత్యవ్రతములను మేము ఏమాత్రమూ మరువకుండా…
పొలమారవా శివా…ప్రతిక్షణము మా గొంతులో….
గురుతురారా శివా…అనుక్షణము మా గుండె శబ్దాలలో….
ఎక్కువవనీ శివా…మాకు నీ పైన మక్కువ….
మొక్కవోని దీక్షతో చేసేము పూజలు కాకుండ నీకేమి తక్కువ….
ఏడు వర్ణాల హరివిళ్లులా మార్చేయరా శివా…మా ఇళ్లని…
కొలువుండి పోయి చేసేయరా శివా నీ గుళ్లుగా ఆ ఇళ్లని..
ప్రతి ఇంట్లో పలకాలి శివా…శుభ మంగళ మంత్రాలు…
ప్రతి గడపlo vinipinchanee శివా…లయ తప్పని స్తోత్రాలు…

పాహిమాం..పాహిమాం..శివశంకరా..పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరాయ శివ రక్షమాం..

Leave a Comment

Scroll to Top