అనగనగ ఒక పురము…ఉజ్జయినీ పురము…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

అనగనగ ఒక పురము…ఉజ్జయినీ పురము…
మనని కావ వెలిశాడు..శ్రీ మహాకాళేశ్వరుడు…
వేడుకొనడమే తరువాయి…
వచ్చి వాలును వెన్ను తట్టి మనవాడై…
రవికిరణ ముఖాంబోరుహ శ్రీ కాళలింగమా…
నీ కరుణ కిరణాల కెరటాలతో మా హృదయ తీరాన్ని తాకుమా…
!!అనగ!!

అశేష భక్తజన కోటి ప్రీతి పాత్రుడతడు…
ప్రేమతో పిలిచితే పలుకు ప్రియమిత్రుడవునతడు..
కోరి కొలిచే వారికి కొంగుబంగారమతడు…
ఆనంద తాండవ ప్రియుడు..ఆదిశంకరుని  అనుగ్రహము పొందిన వాడు..కాడా ఎవరైనా అదృష్టవంతుడు…….
!!అనగ!!

తిరగనేల గుడులు, గోపురాలు తన కోసము….
మనమడగనేల సిరులు, సంపదలు మన కోసము…
నిష్కల్మషమైన హృదయాల నివసించు నతడు…
దైవైక దృష్టి తో పరికించితే…ప్రతి ప్రాణిలో కనిపించు నిటలాక్షుడు…
దైవముగ భావించి,ప్రేమించితే ప్రతి ప్రాణిని…
ఇమ్మని అడగవలెనా మనము భోగ భాగ్యాలు..పినాకపాణిని..

పాహిమాం..పాహిమాం..శివ శంకరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం…అభయంకరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top