సకలాభరణ సర్వాలంకార సుందరేశా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

సకలాభరణ సర్వాలంకార సుందరేశా…
భక్తి భావనలు ఉప్పొంగవా నిను గనిన పార్వతీశ…
త్రిశూల ఢమరుకములు…
మిన్నాగు, చంద్రికలు…
బిల్వదళ సమేత శివశంకరా…
ఓం కార, హాకియా సహిత అభయంకరా..
ఎంత అపురూపమయా నీ దర్శనము…
మా కెంత ఆనంద దాయకమయా నీ సందర్శనము..!!సకలా!!

చల్లంగ చూసేను నేనని తలపైన చంద్రన్ననీ…
పగవారినైనా ప్రేమించుమను తెలుపుతూ మెడలోన నాగన్ననీ…
దుష్టశిక్షణ గావించ త్రిమూర్తుల దివ్యశక్తుల దండమే త్రిశూలమని…
ఢమరుక శబ్ధనాదములతో దుష్టశక్తులను  మీదరి రానివ్వననీ…
కలకాలమూ కాపాడు కరుణామయునివై….
మేమెల్లకాలమూ సంతసముగ నుండ చూడ కోరువానివై…
వెలిశావు కదా శంకరా…అవనిపైన
నీ ధ్యాన ముద్ర వేశావు కదా హర హరా…మా మనసు పైన…

పాహిమాం..పాహిమామ్…శివశంకరా...పాహిమాం..
రక్షమాం..రక్షమాం…అభయంకరా.. రక్షమాం…

Leave a Comment

Scroll to Top