ఓమ్ నమ:శ్శివాయ నమ:


మోహన రూపా గోపాల…
సాక్షాత్కరించావా ఈ వేళ..
గంగాధరుని క్షేత్రాన…
కాళేశ్వరుని హృదయ స్థానాన…
నీ జన్మాష్టమి వేడుకలు జరుపుకొనగ జంగమయ్యతో…
ఆ సంతోషములను పంచుకొనగ భక్తజనులతో…
హరే కృష్ణ.. హరే కృష్ణ..కృష్ణ కృష్ణ..హరే..హరే…
అరె కనులకెంత పండగాయె మిమ్ము చూచు చుంటే భలే..భలే
!!మోహన!!
తెచ్చావా నల్లనయ్య…వెన్నపూస ద్వారకనుండి..
కాస్త తినిపించవయా…మా శంకరుడికి దగ్గరుండి…
చూపావా…మన్ను తిన్న నీ బుంగమూతి బుగ్గలు…
తనకి చెప్పావా…గోపెమ్మల ముద్దు ముద్దు గొడవలు…
నీ లీలామృత గాధవిని పడిపోతే కాళేశ్వరుడు నీ మాయ లోయలో..
దిక్కెవరురా మురళీధరా…లేకుంటే గంగాధరుడు ఉజ్జయినిలో…!!మోహన!!
చూశావా శంకరా..గోపాలుని ముద్దు ముద్దు మోముని…
ఎవరినైనా ప్రేమలో పడేయు నవనీతచోర శిఖామణిని…
వేణుగాన ప్రియుడు వెలిసి నీ పానవట్టము పై…
వేల కాంతులు వెదజల్లే వేవేల గోపికల ఆరాధ్యదైవమై..
జన్మదిన వేళ జంగమయ్యా…చూస్తుంటే తన సొగసులు…
వెల్లివిరెసెనయా నీ లింగాన… పండగా మా కన్న కలలు…
మేము ఉహించనట్టి ఈ అపురూప దృశ్యమాలికలు….
ఈ కృష్ణాష్టమి నాడు ఉట్టి నుండి జారిపడిన మీరిచ్చిన పుణ్య కానుకలు…
పాహిమాం..పాహిమాం..శివశంకరా.పా
నందగోపాల రూపాయా..నాగేశ్వరాయ పాహిమాం…