ఓమ్ నమ:శ్శివాయ నమ:


కదలాలని లేదు శంకరా..ఒక్క అడుగైనా..
నాకు జరగాలని లేదు హర హరా ఎటువైపు కైనా…
నీ ఎదుట నిలిచాక..నిను దర్శించుకొనినాక….
మరల రాదేమోనని నీ పుణ్య వీక్షణము….
కలగ మిగులునేమోనని నీ దివ్య దర్శనము…
దిగులుతో ఈ తనువు కదలనంటే కదలనంటోంది శంకరా…
గుబులుతో నీ పాదాలనొదిలి రాను రానంటోందిరా హర హరా…!!కద!!
పాలుపోదయా పరమేశ్వరా నిను చూడకుంటే…
కాలు నిలువదయా నీ గుడికి చేరకుంటే….
చేయి ఊరుకోదయా నిను పూజించకుండా…
నోరసలు ఆగదయా నిను ప్రార్ధించకుండా….!!కద!!
మనసు నీ వశము అయినపుడు..
తనువు నీ మాయలో పడినపుడు..
వర్ణించ వీలవునా ఏ పండిత శ్రేష్టుడి కైన ఈ అనుభూతిని…
వేల గ్రంధాలు వ్రాసినా సరిపోవునా దేవతా సార్వభౌమా…నీ ఘన కీర్తిని…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమామ్…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా.. రక్షమాం..