ఓం గం గణేశాయ…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఓం గం గణేశాయ…
శివానంద గణపతీం ఆవాయహామీ…
ఓం నమో మహేశాయా..
శ్రీ శివం గణపతీం రూపం మనసాస్మరామీ..!!ఓం!!

సాగించుచున్నాము శివశంకరా మనుగడను.. ఉందంటూ నీ చల్లనీ హామీ..
నీ కరుణ ఖనిజముల కనుసన్నలే మాకున్న కలిమి…
పార్వతీ సుత ప్రియ రూప శివం పుష్పం సమర్పయామి..
లంబోదర శివశంకరం గంధం సమర్పయామీ..!!ఓం!!

గౌరీ శంకరుల మురిపాల ముద్దు గణపయ్యా…
మీ మాతా పితరుల ప్రేమను కాస్తైన మాక్కూడ పంచవయ్య…
ఆ దివ్యానుబంధాల మల్లికలను గీతములుగా మార్చి…
మీపుణ్యానురాగాల పరిమళములను రాగములుగా కూర్చి..
ఆలపిస్తూ పొందేము ఆనందము…
ముమ్మారు తలచుకుంటూ మరి
మరీ మీ బంధము…

పాహిమామ్…పాహిమామ్..శివశంకరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా  రక్షమామ్..

Leave a Comment

Scroll to Top