కన్నామయా నిన్ను లంబోదరా…

ఓం నమఃశ్శివాయనమః🙏🙏🙏      

 కన్నామయా నిన్ను లంబోదరా…
వేడుకున్నామయా నిన్ను గౌరీ కుమారా..
చిరుతిళ్లనుంచాము తిలకించరా….
నీ చిన్ని చిరుకళ్లతో మమ్ము దీవించరా..

కాళేశ్వరుని కొలువు నేడు కళ కళగ మెరిసే…
కన్నపేగును చూసి కాత్యాయినీ పతి మురిసే…
జరుగుతుంటే తన పూజలన్నీ వరుసగా నీకు…
ఒలికెరా నీ తండ్రి శివుని కంట ఆనంద భాష్పాల చినుకు…
దాచుకోలేని సంతోషాన్ని పంచుకొనగ వచ్చెరా పరుగు పరుగున నీ తల్లి దాక్షాయణి…
ప్రియమైన సతిని చేరుకొని నిను తలచుకొని మురిసిపోయెరా గౌరీమ తల్లితో మీ తండ్రి పినాకపాణీ…

పాహిమాం..పాహిమాం..శివశంకరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..గౌరీ శంకరాయ రక్షమాం…

Leave a Comment

Scroll to Top