ఓమ్ నమ:శ్శివాయ నమ:


ముక్తినొసగు నీముఖారవిందము…
కనినంతనే కలుగు పరమా నందము..
ముచ్చటైనవి నీ మూడుకన్నులు..
ముల్లోకములకవి వెన్నుదన్నులు..
సుందరాకృతిన నీదు దర్శనం..
కలుగును కదా ఏ ప్రాణికైన పాప విమోచనం..!!ముక్తి!!
ప్రేమమూర్తివై పరికించుతుంటే..
నీ కంటి పాపలు పిలుచునట్లుంటే..
ఏమిటో ఈ బంధమని నా మనసు అడిగింది…
ఏనాటి పుణ్యఫలమో ఈ వరమని నీ పాదాలు కడిగింది…!!ముక్తి!!
మధుర తేనెల కన్న…
మందార మకరందముల కన్నా…
చిరుదరహాస నయనాల సౌందర్యమే మిన్న…
పరవశించి పాడేను కోటి కీర్తనలు నా మనసు నేనూరుకున్న..
పాహిమామ్..పాహిమామ్.. పరమేశ్వరా..పాహిమామ్..
రక్షమామ్…రక్షమామ్.సర్వేశ్వరా రక్షమామ్..