ఓం నమ:శ్శివాయ నమ:

27.09.2021
నీ చల్లనీ చూపు ఒక సారి చూస్తే చాలయా…
ఏనాటికైనా నీవు దయతలిస్తే చాలయా…
మెలమెల్లగా వెతలు తీరేనయా…
సుతిమెత్తగా వ్యధలు తొలగేనయా…!!నీ!!
స్వర రాగ యజ్ఞము..
ఘోర తపమును గాని చేయలేను…
అల్పజీవిని నేను అర్థించు చున్నాను..
ఆశుకవితలల్ల కాళిదాసును కాను..
ఆపాదమస్తకం నిను దర్శించుకున్నాను…
నీ పాద పద్మముల చెంత నా బ్రతుకు పుస్తకమునుంచాను..!!నీ!!
పరికించరా శంకరా ఒక్కొక్క పుటని నిశితముగా…
చదువగా ప్రతి పుటని మా మీద ప్రేమగా…
కనిపించు నీకు ఎత్తుపల్లాల నడుమ పయనించు మా జీవితము..
తెలిసొచ్చు నీకు ఎగసిపడి ముగిసిన అల లాంటి మా గతము..
మచ్చుకైన కానరావు ఒక్కటైనా పుణ్య ఫలము..
ఒక్క చుక్కనైన రాల్చలేవు ఈ పాపపు కనులు నీ సేవకు శుద్ధ జలము…
పాహిమామ్..పాహిమామ్..పార్వతీ పరమేశ్వరాయ పాహిమాం…
రక్షమామ్..రక్షమామ్…గిరిజాపతీ