ఓం హరా శంకరా..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఓం హరా శంకరా..
వందనం దిగంబరా…
మాం పాహి మహేశ్వరా…
మౌనమింక ఏలరా…
అభయమిచ్చి ఆదుకొనగ కదలి రావా శంకరా…!!ఓం హరా!!

శక్తికొలది నిన్ను కొలుచు దీనుడొక్కడు…
కదలిరాలేను కరుణించమంటూ విలపించునొక్కడు…
అంగరంగవైభవముగ పూజ జరుపు  నిన్ను నొక్కడు..
నాల్గు మారేడు రెమ్మలుంచి నమశ్శివాయ నంటూ  మొక్కు నొక్కడు..
అందరినీ దయచూతువు ఆదిశంకరా….
నీ అంతరంగమందు ఏమున్నదో తెలియదాయెరా..!!ఓం!!

నీ సేవ చేయ నారికేళమంటి మనసు మాదిరా…
లోన మధురనీరు నీ కోసం ఉంచినామురా…
గాటు వేయకుండా త్రాగవయ్య గంగాధరా…
మా భక్తిరసధారామృతజలముల రుచి చూసి మమ్ము కావరా…
!!ఓం హరా!!

పాహిమాం..పాహిమాం… శివశంకరాయా పాహిమాం…
రక్షమామ్..రక్షమామ్..అభయంకరాయా రక్షమాం..

Leave a Comment

Scroll to Top