ఉత్తరాన కేదారేశ్వరము…
దక్షిణాన శ్రీ రామేశ్వరము…
నడుమ శ్రీ కాళేశ్వరము…
నాల్గు దిక్కులను పాలించు నాగేశ్వరం…!!ఉత్తరాన!!
ఆటబొమ్మలమయ్య శంకరా..నీ చేతిలో…
ఆడుకోవయ్య మాతోడ తగు రీతిలో…
పోసేది ప్రాణమూ నువ్వేనయా..
తియ్యగలిగేది ప్రాణమూ నువ్వేనయా…
శంభో హరాయా..శివశంకరా…
వందే గిరీశాయ అభయంకరా..!!ఉత్తరాన!!
సత్యమూ,ధర్మమూ నిలపాలని…
సృష్టించినావు నీ గుళ్ళనీ…
శాంతము, సహనములే సంపదలనీ..
నీ నగుమోము తో చెప్పేవు రా రమ్మని…
దొరకునా నీవంటి దేవుడు ఇల జనులకి…
చేసినా తపములు ఎన్నైనా ముని జనులకి…
శంభో హరాయ శివశంకరా…
వందే గిరీశాయ అభయంకరా…!!ఉత్తరాన!!