ఓం నమః శివాయ నమః
ఎందుకంటే ఏమి చెప్పను ఎటుల తెలిపెద శంకరా…
ఎంతిష్టమంటే ఏ విధముగా నా మనసు తెలుపును ఈశ్వరా…
ఎదుట నిలిచి చూచుకొలదీ మాయ చేతువు శంకరా….
నీ హృదయ వాకిట చేరుకొలదీ మా గమ్యమవుతువు ఈశ్వరా…
శంకరా..శివశంకర..శివ శంకరా శివ హరా హరా…
ఈశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా మము కావరా…!!ఎందు!!
ఎందుకని ఈ జన్మ నాకని ఈ తనువు అడిగెను శంకరా….
చింత వలదని శివుడు కలడని మనసు తెలుపును ఈశ్వరా…
మాట విననీ తోలు తిత్తిది కరుణ చూపుము శంకరా…
ఒక పూటనైనా నిన్ను కొలవని దేహమును మన్నించరా…
శంకరా…శివశంకరా..శివ శంకరా శివ హర హరా..
ఈశ్వరా పరమేశ్వరా..జగదీశ్వర మము కావరా..!!ఎందు!!
ఆశకొలదీ కోరుతున్నా మోక్షమివ్వుము నేరుగా..
ప్రారబ్ధ కర్మల సాకు చూపి తప్పుకొనకయా మెల్లగా…
నీవు కాక క్షమను చూపే దేవుడెవరయ శంకరా…
ఈ జన్నకొక పరమార్థ మొసగే దారి చూపుము ఈశ్వరా…
శంకరా…శివ శంకరా…శివ శంకరా శివ హర హరా…
ఈశ్వరా…పరమేశ్వరా..జగదీశ్వర మము కావరా…!!ఎందు!!
పాహిమాం.. శివ పాహిమాం…పరమేశ్వరా శివ పాహిమాం…
రక్షమాం..హరా రక్షమాం శివ రక్ష మాం.. హర రక్షమాం..