నీరాజనం…నిత్య నీరాజనం…

ఓం నమః శివాయ నమః 

నీరాజనం…నిత్య నీరాజనం…
నిటలాక్ష హృదయనీ నీకు నీరాజనం…
బృందావనం..కరుణ బృందావనం…
నీ కనుల వెన్నెలల తులసీ వనం…
బంగారు నా తల్లి…పరమేశ్వరీ…
పసుపుకుంకుమల సిరులివ్వు జగదీశ్వరీ…!!నీరా!!

పూర్ణ చంద్ర నయనాల శివ కామినీ…
పరమేశ్వరుని మదిలోని సగ భాగినీ …
ఎంత భాగ్యము తల్లి నిను కనిన కనులకు…
కలిసిరాదా యోగము నీ భక్త జనులకు…
అమ్మ…మాయమ్మ అనుచూ నిను కొలవ వచ్చేరు…
పరవశించిన కనులతో నిను చూసి మురిసేరు…!!నీరా!!

సుమధుర ధరహాస మృధుభాషిణి…
అభయహస్త కరకమల వరదాయిని..
ఆశీనురాలివై వుండి పోవమ్మ ప్రతి గుండెలో…
అచ్చెరువు నొందునటుల నిలిచి పోవమ్మ ప్రతి ఇంటిలో…
కొలుతురమ్మా నిన్నందరూ లోకమాత….
కృతజ్ఞతలు తెలుపురమ్మా నీ కందరూ జగన్మాత…!!నీరా!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ...పాహిమాం.
రక్షమాం..రక్షమాం…జగదీశ్వరీ రక్షమాం…

Leave a Comment

Scroll to Top