ఓం నమః శివాయ నమః
ఒక్కటంటే ఒక్కటి వరమివ్వరా ముక్కంటి…
నిను మొక్కుకొనుటే లక్ష్యమై జీవించనీ… శరణంటి….
పాహి పాహి అన్నాను దయను చూపరా….
రక్ష రక్ష అన్నాను మమ్ము కావరా…!!ఒక్క!!
మూడు కనుల శంకరా…ఈ తనువు నీదిరా..
ఫాలనేత్ర హర హరా…ఈ స్వరము నీదిరా…
పలుకనివ్వు సుస్వరమున నీదు నామము…
నను పాడనివ్వు సుమధురముగ నీదు గానము…
గాన కళా కోవిదుడను కాను శంకరా…
లయబద్ధముగ పాడగలను వినుము శంకరా…!!ఒక్క!!
తుమ్మి పూలు తీసుకొచ్చి పూజ చేతును….
మారేడు దళములిచ్చి నీ మదిని గెలుతును…
ఎప్పుడైన తాకవయ్య చెప్పకనే నా గుండె గూటిని…
తెరచి చూసి వెళ్ళుమయ్య ఒక్కసారి నువ్వున్న ఇంటిని…
మదిని గుడిని చేసి నిన్ను కొలుచుచుంటిని….
ప్రతి క్షణము నిన్ను తలచి నేను పరవశించు చుంటిని..!!ఒక్క!!
పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…