ఓమ్ నమ:శ్శివాయ నమ:


కదలి వచ్చామయా శంకరా…
నిను కనగ ఇంటిల్లి పాదీగా…
తరలి వచ్చామయా హర హరా…
ఫల,పుష్ప,పత్రములనర్పించగా…
శంభో హరాయ శివశంకరాయా…
ప్రభో శివాయ పరమేశ్వరాయా..!!కదలి!!
చూడనొచ్చాము ఆశగా నీ అభిషేకములను ఈ కనులతో…
వేడనొచ్చాము మనసారా ముకుళిత సుమ హస్తాలతో…
రానివ్వరా…శంకరా నీ హృదయాలయము లోనికి….
తావివ్వరా హర హరా…కాదనక రవ్వంత చోటైన ఈ దీన జన భక్తకోటికి…!!కదలి!!
ఈ నయనాలతో నిను దర్శించుకొనుటయే నువ్వు మాకు ఇచ్చిన వరము…
ఈ పెదవులు నీ పదనామములు పలుకుటయే నీ వలన కల్గిన భాగ్యము…
నీ గుడి వాకిట నిలిచేందుకు పదములిచ్చావు…
ఏ లోపమూ లేని దేహమూ ఇచ్చావు…
ఇన్నిచ్చిన నీకు మేమేమి ఇవ్వగలమయా…
జన్మనిచ్చిన తండ్రివి…నీవే శలవియ్యవయా…!!కదలి!!
పాహిమామ్…
పాహిమామ్..పరమేశ్వరా…
రక్షమామ్…రక్షమామ్..సర్వేశ్