ఆదిత్యుడమరె నీ అమర లింగమున…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఆదిత్యుడమరె నీ అమర లింగమున…
పరమేశ్వరా నీ దివ్య కిరణములను ప్రసరింప…
అలౌకిక ఆనందమున మా హృదయముప్పొంగె శివశంకరా నీ పూజ జరిపింప…
పంచభూతములనిచ్చి ప్రకృతిని పరిరక్షించు పరమాత్ముడా మంగళం…
ఈ సృష్టి స్థితి గతులను శాసించి పాలించు ధర్మాత్ముడా శుభ మంగళం…!!ఆదిత్యు!!

ఏ పూర్వపుణ్యమో జన్మ నొందాము హైందవ సంస్కృతీ సంపదల వారసులమై…
ఏ నోము ఫలమో దర్శించుకొనుచున్నాము నిత్యమూ నీ దివ్య రూపమును వరగ్రహీతలమై….
సమస్తమూ అర్పించి నిను వేడుకొందుమయ్యా….
సుషుప్తావస్థలో కూడ మము మరువకయ్య…!!ఆదిత్యుడ!!

నీ సేవలో ధన్యులగుటకొరకు పుడుతూనే ఉంటాము నీవు వరమిస్తే వేలసార్లైనా….
నీ కమల నయనాల కరుణ కిరణాలు సోకితే మరచిపోతాము వెతలు లక్ష కోట్లైన…
నీ ఆరాధనా ప్రపంచపు గగన వీధులలో విహరించు వరమియ్యరా…
భక్తి భావనా నివేదనల అర్పణలతో మా ఆత్మ నీలోన కలిసిపోనివ్వరా…!!ఆదిత్యుడ!!

పాహిమామ్..పాహిమామ్…పరమేశ్వరా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్…

Leave a Comment

Scroll to Top