ప్రణవనాద రౌద్ర రూప శంకరా..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏


ప్రణవనాద రౌద్ర రూప శంకరా..
ప్రళయకాల నర్తనల భీకరా..
నీ పదఘట్టనలకు సొమ్మసిల్లు పుడమిరా…
నీ సిరి గజ్జెల సవ్వడికి దద్ధరిల్లు జగమురా..
ఈశ్వరా..మహేశ్వరా..ప్రసన్నుడివి కావుమా…
జఠాధరా..పరాత్పరా…నీ దయాగుణము చూపుమా..!!ప్రణవ!!

క్షణమైన మనగలమా తిలకించి నీ మహోగ్ర రూపాన్ని…
ఎన్ని యుగములైన మరువగలమా నీ సుందర చిరునవ్వుల రూపాన్ని…
నీ కరుణామయ రూపమే మాకు కనుల పండుగ…
మా కనులకొలనులోని గంగతో నీ కాళ్ళు కడిగితే చాలు అదే మాకు శివరాత్రి పండగ…!!ప్రణవ!!

సుసాధ్యమా శంకరా..ఎవరికైన ఏ లోకము వారికైన…
నీ మదిలోనికి చొరబడి ఉపసంహరించుకొనమని నీ ఉగ్రరూపమును వేడుకొన..
మంచు లాగ కరిగి పోవు మనసు నీది….
ప్రేమ పరిమళములను పంచు పూబాలల గుణము నీది…
తల్లి శాంకరియే చెంత చేరి ప్రేమ మీర తీర్చాలి నీ ఆగ్రహావేశము..
నీలో ఉదయించాలి మా జన్మ ధన్యమవగ ప్రేమ మూర్తి స్వరూపము…!!ప్రణవ!!

పాహిమామ్..పాహిమామ్.. శివశంకరా… పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top