ఎవరున్నారు శంకరా…నీవు గాక నాకు తోడు..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఎవరున్నారు శంకరా…నీవు గాక నాకు తోడు..
ఏ కష్టమొచ్చినా చెప్పుకొన నీవే కదా నాకు అమ్మతోడు…
నమ్మరా శంకరా…నా మాట నిజము…
ఔనని తడమరా ప్రేమతో నా కుడిచేతి భుజము..!!ఎవరు!!

ఎవ్వరితో చెప్పుకోలేని బాధలని..
వేరెవ్వరితో పంచుకోలేని వ్యధలని..
విన్నవించుకుంటే దయతోడ వినువాడివి నీవే కదా…
మనసు మంచులాగా కరిగి ఓదార్చు దేవుడివి నీవే కదా…!!ఎవరు!!

తల్లి గర్భాలయములో ఉన్నపుడు పోశావు ఊపిరి…
నేలతల్లి తలపైన పాదాలు మోపినపుడు చిరునవ్వుతో పెంచావు నను మరి…
పెరిగి పెద్దవుతుంటే పెనవేసుకున్నాయి పేగుబంధాలు ఒకటొకటిగా..
వయసు తరిగి పోతుంటే దూరమవుతున్నాయి రక్తసంబంధాలు చెప్పలేనంతగా…
నమ్మవా శంకరా ఇకనైన నా మాట నిజమని….
బొమ్మలా కూర్చుంటే నీకెట్లచూపు నేను ఋజువుని…!!ఎవరు!!

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top