గురుతుకొస్తున్నాయి శంకరా…చిరుప్రాయమున నీ గుడికి వచ్చిన ఆ పాత రోజులు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

గురుతుకొస్తున్నాయి శంకరా…చిరుప్రాయమున నీ గుడికి వచ్చిన ఆ పాత రోజులు…
మెదలుతున్నాయి హర హరా.. కనులముందర మా ఊరి పూజారి నీకు హరతులు ఇచ్చిన క్షణములు…!!గురుతు!!

ఆ వయసులో తెలియలేదు నిలిచి పోతావని నా మనసులో ఈ వయసు వరకూ…
ఈ వయసులో తెలిసింది కలిసిపోతావని మా ఆత్మతో ఈ జన్మ కడతేరువరకూ…!!గురుతు!!

ఏమందురో తెలియదు భక్తునికి,భగవంతునికి వున్న అనుబంధముని….
ఏమనాలో తెలియదు భగవంతుడే పిలిపించుకొని మరీ దర్శనమునిచ్చు సంబంధముని…
పరిశోధించగ నేను పండితుడను కాను శివయ్యా…
ఆ అంతరార్ధము తెలుసుకొన నాకు సాధ్యమా చెప్పవయ్యా…!!గురుతు!!

పాహిమామ్..పాహిమామ్.. పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top